అభివృదే టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు.

0
75

శేరిలింగంపల్లి, నవంబర్ 08: హఫీజ్ పెట్ డివిజన్ ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,మౌళికవసతులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామం,శాంతి నగర్,మదీనగూడా గ్రామం,యూత్ కాలనీ,హుడా కాలనీ,సాయి నగర్ బస్తీలో నూతనంగా చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజ మరియు మంజీర పైప్ లైన్ పనులను శేరిలింగంపల్లి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ గారు,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు,హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి అధికారులతో కలిసి సుమారు.రూ.134.00లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గంగారాం కమ్యూనిటీ హాల్ నందు శంకుస్థాపన చేశారు హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు…

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ…

ప్రజలకు మెరుగైన మౌళికవసతులు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందుగా మంజీర పైప్ లైన్,అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులు చెపట్టడం జరుగుతుందని,ఈరోజు గంగారాం గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ శాశ్వత పరిష్కారం చూపే విధంగా పనులు చేపట్టడం జరుగుతుందని,శాంతి నగర్ బస్తీలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులు పూర్తి చేసి ప్రజలకు నూతన రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు, ముఖ్యంగా ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామంలో,హుడా కాలనీ,మదీనగూడా,యూత్ కాలనీ,సాయి నగర్ బస్తీలో పెండింగులో ఉన్న మౌళికవసతులు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా అధికారులతో కలిసి ముందుకు సాగుతమని తెలిపారు..

ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు,బస్తి/కాలనీ వాసులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.