కష్ట కాలంలో పేద ప్రజల ఆకలి తీర్చడానికి ముందుకు వస్తున్న దాతలకు ధన్యవాదాలు.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్.

0
184

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు, వలస కూలీల ఆకలి తీరుస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్. ఈరోజు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఉషోదయా అపార్ట్మెంట్, మాధవ నగర్, సైబర్ వ్యాలీ నందు అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జి.హెచ్.ఎం.సి కార్మికులకు మరియు సుమారు 200 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరియు శానిటైజర్ కార్పొరేటర్ గారి చేతుల మీదుగా అందించారు..

ఉషోదయా అపార్ట్మెంట్
అరవింద్,సునీల్,వంశీ,కిషోర్…
మాధవ నగర్..
నరేష్,వెంకటేశ్వరరావు,అనిల్,సాంబి రెడ్డి,హేమంత్…
సైబర్ వ్యాలీ..
షఫీ,హుస్సేన్…

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
పేదప్రజల ఆకలి తీర్చడానికి స్వచ్ఛందగా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారు నివాసిస్తునటువంటి కాలనీ, బస్తీలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువుల అందించడం,వారిలో తోడుగా ఒక భరోసాని కల్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..

ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, రఘురాం, యాదగిరి, వినయ్ కుమార్ గౌడ్, ముఖ్తర్, సత్తి రెడ్డి, రామకృష్ణ, రాములు, రెహ్మాన్, హేమంత్, రమేష్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.