గౌరవ చేవెళ్ల యంపి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారితో కలిసి ప్రజలకు ఆహారపదార్థాలు,కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు.

0
80

చేవెళ్ల, మే 5: ఈరోజు పరిగి నియోజకవర్గం లోని పూడూర్, సుల్తాన్ పూర్, తునుకుల గడ్డ, కిష్టమ్మ గుడి తాండ గ్రామాలలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారితో కలసి ప్రజలకు కూరగాయలు, గుడ్ల ను, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు యం.పి.టి.సి లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… తెలంగాణలో కరోన కారణంగా ఏ ఒక్కరూ కూడా ఆకలితో బాధ పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఏ రాష్ట్రంలో అమలు చేయని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన రాష్ట్రానికి చెందిన వారికే కాకుండా ఇక్కడకు వలన వచ్చిన వారికి సైతం ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.