పూజారులకు, నాయి బ్రాహ్మణులకు, వాచ్మెన్లకు, పేదలకు కిరాణా సరుకులు పంపిణీ: సాయి కృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ నిమ్మల సాయి కృష్ణ గౌడ్

0
142

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, ప్రజలను ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు ఆహారం కొరత ఉండొద్దనే ఉద్దేశ్యంతో సాయి కృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ నిమ్మల సాయి కృష్ణ గౌడ్ తన వంతు బాధ్యతగా స్వంత నిధులతో ప్రజయ్ సిటి సాక్షి గణపతి ఆలయం వద్ద పూజారులకు, నాయి బ్రాహ్మణులకు, వాచ్మెన్లకు, పేదలకు కిరాణా సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజయ్ సిటి సెంట్రల్ అసోసియేషన్ సెక్రటరీ గాదె శేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాయుడు, కార్యవర్గ సభ్యులు సుబ్బారావు, రత్నం, హుస్సేన్, శివ, సుభాష్, శంకర్ రావు, సుబ్బారావు, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
ఎన్. నాగ రవళి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.