పేదలకు సహాయం చేసిన సురక్ష ఎన్క్లేవ్ కాలనీ సభ్యులకు అభినందనలు. కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

0
78

చందానగర్ డివిజన్ సురక్ష ఎనక్లేవ్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద సురక్ష ఎనక్లేవ్ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసుల ఆధ్వర్యంలో పేదలకు తమ వంతు సహాయం గా సుమారు 70 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సురక్ష ఎనక్లేవ్ కాలనీ సభ్యులు ముందుకు వచ్చి మేమున్నము అని పేదలకు నిత్యావసరాల వస్తువులు అంటే కంది పప్పు, నూనె, షుగర్, గోధుమ పిండి, మిర్చి పౌడర్, పసుపు, సబ్బులు (ప్యాకెట్ ధర 400 రూపాయల) ఇచ్చి మరియు వారికి ఒక్కొక్కరికి 100 రూపాయలు (కూరగాయలు కొనుక్కోవడానికి) సహాయం చేసి వారిని ఆదుకోవడం అభినిందనీయం అని, ఇలాగే చందానగర్ డివిజన్ లో దాతలు ముందుకు వచ్చి బస్తీల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని చెప్పటం జరిగినది.

ఈ కార్యక్రమంలో రఘునాధ్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, మల్ల రెడ్డి, రవి, రమేష్, శ్రీశైలం, నర్సింలు, పోచయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL.