పేదలను,వలస కూలీలను ఆదుకోవటానికి ముందుకు రావాలి దాతలకు పిలుపు:బొబ్బ నవత రెడ్డి కార్పొరేటర్

0
177

పేద ప్రజలకు ఒక ఉద్యమకారుడిగా ఆపన్న హస్తం అందించిన పార్నంది శ్రీకాంత్.. కార్పోరేటర్ బొబ్బ నవత రెడ్డి…

చందానగర్ డివిజన్ విద్యా నగర్ కాలనీలో ఈరోజు ఎమ్మెల్యే గాంధీ గారు మరియు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సూచనల మేరకు తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పార్నంది శ్రీకాంత్ తన సొంత ఖర్చులతో సుమారు 1000 మందికి నిత్యావసరాల వస్తువులు అందించాలని నిర్ణయంతో మొదటగా ఈ రోజు విద్యా నగర్ కాలనీలో శానిటేషన్ సిబ్బందికి మరియు డివిజన్లో చుట్టుపక్కల కాలనీల పేదలకు సుమారు 250 మందికి నిత్యావసర వస్తువులు అంటే బియ్యం, కూరగాయలు మొదలగునవి పంపిణీ చేయడం జరిగినది .

కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో సమదూరం పాటిస్తూ పంపిణీ చేయడం అభినందనీయమని , పార్నంది శ్రీకాంత్ ను ఆదర్శంగా తీసుకొని పేదల ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని దాతలకు మనవి చేసారు…క‌రోనా వైర‌స్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ ఫ‌లితంగా ఎవ‌రు ఇబ్బందులు ప‌డుతున్నా.. ఆదుకునేందుకు ముందుంటామని ,ఎవ్వరికీ ఏమి ఇబ్బంది రానివ్వమని చెప్పటం జరిగినది.

ఈ కార్యక్రమంలో బొబ్బ విజయ రెడ్డి,లక్ష్మా రెడ్డి,నీలకంఠ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,ధర్మేందర్ దూబె,దామోదర్ రెడ్డి,అనంత రెడ్డి,గౌస్,మొదలగు
కాలనీ వాసులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా ఎన్ ఏ సి న్యూస్ ఛానల్.