ప్రజల భద్రత మా ప్రాధాన్యత… శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్.

0
20

శేరిలింగంపల్లి, August: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన క్రమంలో అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావ్వొద్దని కోరారు శేరిలింగంపల్లి శాసనసభ్యులు గౌవర ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ గారు..

ఈరోజు మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు సొంత నిధులతో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన హైపోక్లోరైడ్ స్ప్రే ట్రకును అయ్యప్ప సొసైటీ నందు గౌరవ శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ.అరేకపూడి గాంధీ గారు జెండా ఊపి ప్రారంభించారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి స్పూర్తితో మా వంతుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యంపై మరియు పరిసరాల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటామని, జి.హెచ్.ఎం.సి సిబంది కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఈ ట్రక్ హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో హైపోక్లోరైడ్ స్ప్రే చేయించడం జరుగుతుందన్ని తెలిపారు..

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, నారాయణ రెడ్డి, హున్య నాయక్, నర్సింహ, సాంబయ్య, రాంరెడ్డి, రాములు, లక్ష్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఇంజినీరింగ్ ఎనక్లేవ్ నందు కాలనీ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్ప్రే చేయించారు..ఈ కార్యక్రమంలో ఆంజనేయ రాజు, చంద్రశేఖర్, బి.ఆర్.సి రెడ్డి, జె.ఎన్ రావు, కరుణాకర్ గౌడ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.