బ్రాహ్మణ అర్చకులకు, పురోహితులకు, వితంతువులకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

0
101

124 డివిజన్ లో బ్రాహ్మణ అర్చకులకు, పురోహితులకు, ఏ ఆసరా లేని వితంతువులకు, వృద్ధులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు 84 మంది కి గాను ప్రతి ఒక్కరికీ 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేయడం జరిగింది. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ… పౌరోహిత్యం మీద ఆధారపడి ఉండే బ్రాహ్మణులను ఆదుకుంటానని చెప్పారు. కొరోనా పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటం, డివిజన్ ప్రజల కృషితో మన డివిజన్ లో పరిస్థితులు మంచిగా ఉన్నాయని లాక్ డౌన్ ఇత్తేసే వరకు అందరూ అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డ్ మెంబర్ చిన్నొళ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, శశి, రాజేష్ చంద్ర, ఏరియా కమిటీ మెంబర్ శౌకత్ అలీ మున్న, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పాలడుగు జానయ్య, యాదన్న సమద్, గుడ్ల శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.