మాదాపూర్ డివిజన్ను అభివృద్ధిలో ముందుంచుతాం.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

0
48

శేరిలింగంపల్లి, నవంబర్ 08: మాదాపూర్ డివిజన్ అభివృదే ప్రధాన లక్ష్యంగా,ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి దిశానిర్దేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, సుభాష్ నగర్, భిక్షపతి నగర్, ఇజత్ నగర్, అయ్యప్ప సొసైటీ, సైబర్ విలేజ్, శిల్ప లేఔట్, మాతృశ్రీ నగర్, సియేట్ కాలనీ మరియు కాకతీయ హిల్స్ కాలనీ నందు రూ.218.25 లక్షల వ్యయంతో నూతన చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజ మరియు మంజీర పైప్ లైన్ పనులకు ఆదిత్య నగర్ బ్రిడ్జి వద్దా శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ.అరేకపూడి గాంధీ గారు, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి అధికారులు మరియు స్థానిక బస్తి నాయకులు, డివిజన్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇప్పటికే మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని, అభివృదే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నామని, తమ దృష్టికి వచ్చే ప్రతి మౌళికవసతులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డ్/ఏరియా సభ్యులు, మహిళలు, బస్తి నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.