యంపి.డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు: లాక్ డౌన్ వలన ఏర్పడిన విపత్కర పరిస్థితుల నండి పేద ప్రజలను ఆదుకుంటున్న దాతలకు ధన్యవాదాలు:

0
81

ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం, శంకర్ పల్లి మండలంలోని గోపులారం గ్రామంలో భారత్ ఫార్మా కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి గారు మరియు సంస్థ ప్రతినిధులతో కలిసి పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక యం.పి.పి.డి. గోవర్ధన్ రెడ్డి గారు, జడ్పీటీసీ ‌గోవిందమ్మ ‌గారు, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… కరొన లాక్ డౌన్ వలన ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడకుండా చాలా మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.