రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అండగా ఉంటూ,ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను అందించడం జరుగుతుంది. 30వ రోజు నిరంతరాయంగా పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది: శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

0
145

మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద, వలస కూలీలకు ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎల్లపుడు అందుబాటులో ఉంటామని, ప్రజలెవ్వరు పస్థులు ఉండొద్దనే ఏకైక ఉద్దేశంతో 30 రోజులుగా నిరంతరం రోజు సుమారు 3000మంది నిరుపేద ప్రజలకు, వలస కూలీలకు సామాజిక బాధ్యతగా మధ్యాహ్నం బోజనాలను ఉచితంగా దాతలసహాయంతో మరియు సొంత ఖర్చుతో అందించడం జరిగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు ఒక సైనికుడిలాగా మాకు తోడుగా ఉంటూ ప్రజలకు భోజనాలు అందించడం చాలా గర్వంగా ఉందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్ సాయి నగర్,గుట్టల బేగంపేట,భిక్షపతి నగర్ నందు నిరుపేదలకు బోజనాలను స్థానిక నాయకులతో కలిసి అందించారు.. ఇప్పటికే జి.హెచ్.ఎం.సి అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ x రోడ్డు, మాదాపూర్ మెయిన్ రోడ్డు, చంద్ర నాయక్ తండా నందు ప్రజలకు ఉచితంగా భోజనం అందించడం జరుగుతుందని,రేపటి నుంచి ఇంకో 5 చోట్ల అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ప్రజలకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు..

నేటి దాతలు శ్రీ.భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, యాక్టర్ శ్రీ.జీవన్ గారు, కోవిడ్-19 కరోనా హెల్ప్ డెస్క్ టీమ్ మరియు జనప్రియ ఫేస్-1 సోల్ గ్రూప్ అయ్యప్ప కమిటీ శ్రీనివాస్ గురు స్వామి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రావు, గవాస్కర్, రమేష్, ప్రవీణగౌడ్, హనుమంతు, రాము, వేణు, ఆనంద్, నర్సింగ కృష్ణ గారు 1200 మందికి భోజన పొట్లాలను అందించారు..

ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సహదేవ్, సాంబయ్య, గోపాల్ నాయక్, వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్, రహీం, అజ్జిజుద్దీన్, సర్వర్, శ్యామ్, మహేష్, చోటేమియా, నాయిమ్, సలీం, బాబూమియా, కృష్ణ యాదవ్, మునఫ్ ఖాన్, నర్సింగ్ రావు, సర్దార్, జకీర్, హెల్త్ ఆఫీసర్ రవి, ఎస్.ఆర్.పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.