రేషన్ కార్డ్ ఉన్న ప్రతి లబ్దిదారుడుకి ప్రభుత్యం అందించే 12 కేజీల ఉచిత బియ్యంను అందించే బాధ్యత రేషన్ షాప్ ఓనర్ దే. పేదవారిని అదుకోవటమే ప్రభుత్య ద్యేయం: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
43

‘కరోనా’ లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని పేదలు ఆకలితో అలమటించకుండ ఉండేందుకే ఉచితంగా రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారని, ఇందులో భాగంగానే చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ కాలనీలో ఉన్న రేషన్ షాప్ లో ఈరోజు 2వ విడత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున,కుటుంబంలో ఇద్దరు ఉంటే 24 కిలోలు, నలుగురు ఉంటే 48 కిలోలు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, అలాగే కూరగాయలు, నిత్యావసరాల వస్తువులు కొనుకోవటానికి ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్ కి 1500 వందల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయటం జరుగుతుందని, రేషన్ షాప్లో రేషన్ బియ్యం 15 వ తేదీ వరకు ఇవ్వటం జరుగుతుంది అని, రేషన్‌ షాప్‌కు వచ్చే వారు ప్రతి ఒక్కరు కనీసం 1 మీటర్ దూరం పాటించి రేషన్‌ బియ్యాన్ని తీసుకెళ్ళాల‌ని, ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాల‌ని, రేషన్‌ షాప్‌కి వచ్చేవారు క్యూ పద్ధతిలో దూరం పాటించి రేషన్‌ సరుకులు తీసుకువెళ్లాలని, రేషన్ కార్డ్ తీసుకొని వచ్చిన ప్రతి లబ్దిదారుడుకి ప్రభుత్యం నిబంధనల ప్రకారం ఉచిత బియ్యంను అందించే బాధ్యత రేషన్ షాప్ ఓనర్ దే అని చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్,నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.