వరుసగా BSR TRUST అన్నదాన వితరణ:

0
200

అన్ని దానాల్లోకీ అన్నదానమే మిన్న          భద్రాచలం తహసీల్దారు శ్రీ. శేషగిరి రావు.

నేటి ముఖ్య అతిధి:..
భద్రాచలం తహసీల్దారు శ్రీ. శేషగిరి రావుచే నేటి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

భారతదేశంలో కూడా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజాలెవ్వరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు
అనేక చర్యలు చేపడుతున్న నేపధ్యం లోకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సమయం కంటే ముందుగానే శ్రీ సీతారాముల కళ్యాణం కళ్యాణం చూద్దామని వచ్చిన భక్తులు, వలస కార్మికులు, యాచకులు అనేకమంది నిరాశ్రయులై ఆకలితో అలాంటిస్తూ తినడానికి తిండి ఉండడానికి గూడు లేక విలవిలలాడుతున్న నేపధ్యం లో తన తండ్రి గారైన కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి నిరాశ్రయ నిర్వాసితులకు తన బి యస్ ఆర్ గార్డెన్స్ నందలి అన్నపూర్ణా ఫంక్షన్ హాలు నందు ఉచిత వసతి, అల్పాహారం తో పాటుగా రెండు పూటలూ భోజన సౌకర్యాలు కల్పించడం పరమపుణ్యం అని, అన్నిదానాల్లోకి అన్నదానం మిన్న అని, ఈ విపత్కరసమయం లో అన్నదానమే మహాదానమని భద్రాచలం తహసీల్దారు శేషగిరిరావు గారు,
డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డితో పాటుగా అన్నదానానికి సహకరిస్తున్న దాతలను అభినందించారు.

ఆ తరువాత అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికే పట్టణం లోని వివిధ ప్రాంతాలనుండి అక్కడకు వచ్చి వేచి ఉన్న అన్నార్తులకు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వయం నియంత్రణ పాటించాల్సిందిగా ఉద్బోధించారు మరియు ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి అని పేర్కొన్నారు కరోణ మహమ్మారి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడున్న నిరాశ్రయులకు ఉద్బోధించారు

నేటి కార్యక్రమంలో భద్రాచలం తహసీల్దారు శేషగిరిరావు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చైతన్య, రూపా స్కూలు అధినేత శ్రీ.పచ్చినీలం మునికేశవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ఆపదసమయం లో ఉచిత భోజన, వసతి సేవలందిస్తున్న డా.బూసిరెడ్డి కి మేముసైతం అంటూ ఈ రోజు అన్నదానం కు అయ్యే ఖర్చుకు ఆర్ధికంగా చేయత్నిచ్చి తమ వంతు సహకరించిన కోసం నేటి దాతలు మానవతామూర్తులు, భద్రాచలం పట్టణానికి *రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ రొటేరియన్ పలివేల చిన్నరాజు దంపతులు మరియూ రూపాస్కూలు అధినేత రొటేరియన్లు పచ్చి నీలం మునికేశవ్లను* మరియు నిన్న సాయంత్రం అన్నపూర్ణా ఫంక్షన్ హాలులో ఉన్న నిర్వాసితులకు భోజన వితరణకు సహకరించిన ఇందిరా మార్కెట్ గణేష్ ఉత్సవ సమీతి ఆర్యవైశ్య సంఘ సభ్యులకు వారి కుటుంబ సభ్యులను డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి అభినందించారు..
ఇటువంటి మంచి మనసున్న దాతలను భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారు వారి వారి కుటుంబాలను ఎల్లవేళలా ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యంలతో పాటు సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అభిలాషించారు..

అన్నపూర్ణా ఫంక్షన్ హాలు నందు వసతి పొందుతూ హాలు లొనే తలదాచుకుంటున్న వారికి మరియు బయటినుండి పట్టణం లోని వివిధ ప్రాంతాల నుండి హాలు వద్దకు వచ్చి వేచి ఉన్న నిస్సహాయ నిరాశ్రయులకు, పార్సిల్ చేసి సిద్ధంగా ఉంచిన 300 అన్నప్రసాద వితరణ పాకెట్స్ ను ఈ రోజు అన్నపూర్ణా ఫంక్షన్ హాలు వద్ద పంచడం జరిగింది,.. మరికొన్ని అన్నప్రసాద భోజన పాకెట్లు భద్రాచలంలోని గోపాలకృష్ణ థియేటర్ పక్క సందులోని స్లమ్ ఏరియాలో 70 మంది నిస్సహాయులకు పంపిణీ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో నేటికీ 8 రోజులుగా కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సేవలందిస్తున్న సేవా బృందసభ్యులు వంటమాష్టరు జబర్దస్త్ రమేష్, కావూరి ప్రభాకర్, గంజి సంపత్, కాకరాల శ్రీనివాసశర్మ , కిరణ్, బిందు ప్రభాకర్, రాంగోటి గిరి, కొండారెడ్డి, రాజబాబు, పద్మ శ్రీనివాసు, రమేష్, హసీనా నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.