సామాజిక దూరం పాటిస్తూ, కరోనా వైరస్ ను పారదోలుదాం.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
85

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవలన ఈరోజు రాష్ట్రంలో వైరస్ చాలా వరకు నియంత్రించామని, ఈరోజు ఇతర రాష్ట్రాల వలస కూలీలకు సైతం తోడుగా ఉంటూ వారిని వారి వారి సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారికి మరియు ఇంతటి క్లిష్టమైన సమయంలో కూడా ప్రజా సమస్యలపై, రాష్ట్ర అభివృద్ధి పనులపై నిరంతరం సమీక్ష సమావేశం నిర్వహిస్తూ,అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ శాఖామంత్రి వర్యులు శ్రీ.కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

1… మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ నందు స్థానిక కార్పొరేటర్ గారి పిలుపుమేరకు ముందుకు వచ్చి ఐక్య ఎన్.జి.ఓ సంస్థ మరియు అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు..
ఈ కార్యక్రమంలో నాయకులు జయరాజ్ యాదవ్, తైలి కృష్ణ, కృష్ణ నాయక్, శ్యామ్, కోటేశ్, తైలి గిరి, దేవయ్య, బాలేష్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు..

2… హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ 1 కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 30 నిరుపేద కుటుంబాలకు, జి.హెచ్.ఎం.సి కార్మికులకు నిత్యావసర వస్తువులను కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారి చేతులమీదుగా అందించారు..
ఈ కార్యక్రమంలో డాక్టర్.అపల్నాయుడు, వి.వి మూర్తి, బి.శాంతియ్య, ఉమామహేశ్వరరావు, చార్లెస్,జైసూరి, రవి, సి.హెచ్.సత్యనారాయణ, శివరాజ్, శ్రీనివాస్, సురేష్, భిక్షపతి గౌడ్, మల్లికార్జున, రాజు, ఏసుదాస్, శివ తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.