32వ రోజు నిరంతరాయంగా పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది.. కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్

0
211

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను అందించడం జరుగుతుంది.. వి.జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్.

మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద, వలస కూలీలకు ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎల్లపుడు అందుబాటులో ఉంటామని, ప్రజలెవ్వరు పస్థులు ఉండొద్దనే ఏకైక ఉదేశంతో 32 రోజులుగా నిరంతరం రోజు సుమారు 3000 మంది నిరుపేద ప్రజలకు, వలస కూలీలకు సామాజిక బాధ్యతగా మధ్యాహ్నం బోజనాలను ఉచితంగా దాతల సహాయంతో మరియు సొంత ఖర్చుతో అందించడం జరిగుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్ సాయి నగర్, గుట్టల బేగంపేట, ఖానమేట్ నందు నిరుపేదలకు బోజనాలను స్థానిక నాయకులతో కలిసి అందించారు.. ఇప్పటికే జి.హెచ్.ఎం.సి అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ x రోడ్డు,మాదాపూర్ మెయిన్ రోడ్డు, చంద్ర నాయక్ తండా నందు ప్రజలకు ఉచితంగా భోజనం అందించడం జరుగుతుందని, 3రోజుల నుండి సాయి నగర్, మాదాపూర్, ఇజత్ నగర్ నందు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ప్రజలకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు..

నేటి దాతలు శ్రీ.భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, యాక్టర్ శ్రీ.జీవన్ గారు, కోవిడ్-19 కరోనా హెల్ప్ డెస్క్ టీమ్, ఆదిత్య నగర్ సాయి బాబా మందిరం కమిటీ సభ్యులు మరియు జనప్రియ ఫేస్-1 ప్రవీణ్ గౌడ్ గారు 1400 మందికి భోజన పోట్లలను అందించారు..

ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సహదేవ్, సాంబయ్య, ఓ.కృష్ణ, గోపాల్, వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్, రహీం, అజ్జిజుద్దీన్, సార్వార్, శ్యామ్, మహేష్, చోటేమియా, నాయిమ్, సలీం, బాబూమియా, కృష్ణ యాదవ్, మునఫ్ ఖాన్, నర్సింగ్ రావు, సర్దార్, జకీర్, హెల్త్ ఆఫీసర్ రవి, ఎస్.ఆర్.పి శ్రీనివాస్ రెడ్డి, సోల్ గ్రూప్ అయ్యప్ప కమిటీ శ్రీనివాస్ గురు స్వామి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రావు, గవాస్కర్, రమేష్, ప్రవీణగౌడ్, హనుమంతు, రాము, వేణు, ఆనంద్, నర్సింగ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.