National Anti Corruption News Channel

0
73

శేరిలింగంపల్లి, నవంబర్ 08: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ లో HMWS బోర్డు నిధులతో మంజూరైన రూ.57 లక్షల 40 వేల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే యూజీడీ పైప్ లైన్ మరియు మంచినీటి పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ గారు, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారు, HMWS అధికారులు, స్థానిక నాయకులతో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు స్థానిక నాయకులతో కలసి సిద్దిఖ్ నగర్ లో పర్యటించి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు తెలుసుకున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధే తారక మంత్రంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే గాంధీ గారు అన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేసుకుంటున్నామని, దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక ప్రణాళికతో పనులను చేయిస్తున్నామని ఎమ్మెల్యే గాంధీ గారు పేర్కొన్నారు.

కొండాపూర్ డివిజన్ లో అభివృద్దే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు అన్నారు. సమస్యల రహిత డివిజన్ గా అభివృద్ధి పరచటానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో, మంత్రివర్యులు కేటీఆర్ గారి అద్భుతమైన విజన్ తో ఉన్నత స్థాయికి రాష్ట్రం పురోగమిస్తోంది అని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్ వాటర్ బోర్డు డిప్యూటీ మేనేజర్ శ్రీమన్నారాయణ, డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్, వార్డు మెంబర్స్ నరసింహ సాగర్, చాంద్ పాషా, శ్రీనివాస్ చౌదరి, జంగం గౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం, ఏరియా కమిటీ మెంబర్స్ విజయ్, తిరుపతయ్య, రవి శంకర్ నాయక్, తెరాస నాయకులు నందు, పద్మశ్రీ, తిరుపతి రెడ్డి, హీనాయత్, చారీ, యూత్ నాయకులు దీపక్, గణపతి, శ్రీను, వెంకటేష్, నరేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.