అకాల వర్షం బాధిత కుటుంబాలని ఆదుకున్న ముఖ్యమంత్రి పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన కార్పొరేటర్ హమీద్ పటేల్

0
165

శేరిలింగంపల్లి, అక్టోబర్ 30: అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకోవటం జరుగుతున్నదని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం మేరకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ, అంజయ్య నగర్, సిద్దిఖ్ నగర్ లలోని ప్రభుత్వ పరంగా అందజేస్తున్న పదివేలు రూపాయల ఆర్ధిక సహాయాన్ని అకాల వర్ష బాధిత కుటుంబాలకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అందజేశారు. పేద ప్రజల పట్ల ఉన్న బాధ్యత, చిత్తశుద్ధిని తెరాస ప్రభుత్వం మరోమారు నిరూపించుకుందని తెలియజేశారు. ప్రతి బాధిత కుటుంబానికి ఆ ఇంటి పెద్ద కొడుకులా నిలబడి ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు.

కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా వార్డు మెంబర్ జంగంగౌడ్, వైస్ ప్రెసిడెంట్ భీమిలి శ్రీనివాస్, నీలం లక్ష్మినారాయణ, యూత్ నాయకులు దీపక్, మతీన్, ఖాసీం స్థానికులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here