అకాల వర్షాలకు ముంపు ప్రాంతాలలోని ప్రజలకు, ప్రభుత్వం తక్షణ సహాయం: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

0
164

శేరిలింగంపల్లి, అక్టోబర్ 23: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ముంపు ప్రాంతాలలోని ప్రజలు వరదలకు ఇంట్లోని సామాగ్రి కోల్పోయి అవస్థలు పడుతున్న వారిని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద పదివేల రూపాయల ఆర్థిక ప్యాకేజీని అందజేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బాధితులకు వారి ఇంటి వద్దకు చేరుకుని పది వేల రూపాయల నగదు శేర్లింగంపల్లి శాసనసభ్యులు గాంధీ గారి ఆదేశాల మేరకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ధరణి నగర్ కాలనీలో బాధితులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డు సభ్యులు చిన్న శ్రీనివాస్ కాశీనాథ్ యాదవ్, డివిజన్ బిసి సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, నాయకులు బోయ కిషన్, సల్మా రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మహేందర్ రెడ్డి, సత్యనారాయణ, నాగేశ్వరరావు, గోపాల్ ఆది కేశవులు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here