అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
162

Serilingampally June 06: చందానగర్ డివిజన్ అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ లో పట్టణ ప్రగతి సమగ్ర పరిశుభ్రత కార్యక్రమంను కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… రానున్న వర్షాకాలం లో దృష్టిలో పెట్టుకొని బస్తీలలో,కాలనీలలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం జూన్ 1 నుంచి 8 వరకు మున్సిపల్ శాఖ మంత్రి కే టీ ఆర్ గారి ఆదేశాల మేరకు,MLA గాంధీ గారి సూచన మేరకు వారం రోజులు పాటు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, కావున 6వ రోజు అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీ లో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగినది అని,కాలనీలలో రోడ్డు ఇరువైపులా ఉన్న మట్టికుప్పలను, ఖాళీ స్థలాల్లో ఉండే చెత్తాచెదారములను తొలగించడం వల్ల దోమలు నిల్వలేకుండా చేయడంవల్ల సీజనల్ వ్యాధులైన డెంగ్యూ,చికెన్ గున్యా మరియు విష జ్వరాలు వంటివి రాకుండా అరికట్టవచ్చని చెప్పటం జరిగినది.

ఈ కార్యక్రమంలో కోటేశ్వర రావు, సంతోష్,శ్రీనివాస్,మల్లికార్జున్,రాజు, రమణ రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here