అన్ని దానాల్లోకన్నా అన్నదానం మిన్న..
భద్రాచలం డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ చౌహన్.
నేటి ముఖ్య అతిధి:..
భద్రాచలం డివిజనల్ పోస్టల్ సూపరడెంట్ అజయ్ సింగ్ చౌహాన్
గారి చే నేటి నిస్సహాయులను ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది..
షుమారు 200 ల ప్రపంచదేశాలతో పాటుగా భారతదేశంలో కూడా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజాలెవ్వరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు
అనేక చర్యలు చేపడుతున్నాయి.
అట్టి చర్యల్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో వలసకార్మికులు, యాచకులు ఏ దిక్కు లేని అనేకమంది నిస్సహాలు విలవిలలాడుతున్న నేపధ్యం లో తన తండ్రి గారైన కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి నిరాశ్రయకులకు నిస్సహాయకులకు తన BSR గార్డెన్స్ నందలి అన్నపూర్ణా ఫంక్షన్ హాలు నందు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఈ ఆపదసమయం లో కల్పించడం పరమపుణ్యం అని అన్నిధానాల్లోకి అన్నదానం మిన్న అని భద్రాచలం డివిజనల్ పోస్టల్ సూపరడెంట్ అజయ్ సింగ్ చౌహాన్
డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డిని అభినందించారు.
ఈ ఆపదసమయం లో ఉచిత భోజన వసతి సేవలందిస్తున్న డా.బూసిరెడ్డి కి మేముసైతం అంటూ ఈ రోజు బోజనానికి అయ్యే ఖర్చు కోసం 6000/ రూపాయలు అందించిన నేటి దాత, మానవతామూర్తి, భద్రాచలం పట్టణ పోస్ట్ మాస్టర్ నేటి అన్నదాత బెల్లంకొండ రమేష్ ఆనందం వ్యక్తం చేశారు
బెల్లంకొండ రమేష్ను, రమేష్ తనయుడు బెల్లకొండ భరత్ లను మరియు వారి కుటుంబసభ్యులను డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు వారి కుటుంబాన్ని ఎల్లవేళలా ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యం లతో పాటు సుఖసంతోషాలతో ఆశీర్వదించాలని డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అభిలాషించారు..
అప్పటికే అక్కడ వసతి పొందుతున్న వారికి బయటినుంది వచ్చి అక్కడ వేచి ఉన్న వారికీ నిస్సహాయ నిరాశ్రయులైన నిస్సహాయులకు అప్పటికే పార్సిల్ చేసి సిద్ధంగా ఉంచిన
అన్నప్రసాద వితరణ పాకెట్స్ ను పంచడం జరిగింది,
మిగతా అన్నప్రసాదభోజన భోజన పాకెట్లు భద్రాచలం లోని గోపాలకృష్ణ థియేటర్ పక్క సందులో ని స్లమ్ ఏరియాలో షుమారు 60 మంది నిస్సహాయులకు పంపిణీ చేయడం జరిగింది
నేటికీ 5 రోజులుగా కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ బూసి రెడ్డి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భద్రాద్రి పట్టణాల్లో నివసించే నిస్సహాయుల కోసం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో ఉచితంగా సేవలందిస్తున్న సేవాబృందసభ్యులు వంటమాష్టరు జబర్దస్త్ రమేష్, కావూరి ప్రభాకర్, గంజి సంపత్, కాకరాల శ్రీనివాసశర్మ , కిరణ్, బిందు, గుడికందుల శ్రీనివాసు, బస్వోజు వెంకటేస్వర్లు, రాంగోటి గిరి, కొండారెడ్డి, చల్లా సాహిత్ మీరా, హసీనా తదితరులు పాల్గొన్నారు.
Telangana State Nalla Sanjeeva Reddy, Bureau Chief South India NAC NEWS CHANNEL