ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల సవాల్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

0
182

శేరిలింగంపల్లి, మే 24: కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల సవాల్ లో భాగంగా ఎల్లమ్మ బండ లోని మసీదు ఆవరణలో ఎంటమాలజీ అధికారులతో కలిసి పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టారు. ఆవరణ లో నిల్వ ఉంచిన నీటిని తొలగించి దోమల మందు, కార్బో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు. రేపు జరగనున్న రంజాన్ వేడుకలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని కార్పొరేటర్ తెలిపారు..మసీదు లోని తొట్లు, మొక్కల వద్ద నిల్వ నీటిని తొలగించి బ్లీచింగ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యువనేత రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు గణేష్, నాయకులు మున్నా, కైసర్ బాయ్, ముస్తఫా, కాజా, ఎంటమాలజీ అధికారి నరసింహ సిబ్బంది తదితరులున్నారు ఉన్నారు

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here