ఇంటిని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం వ్యాధులు రాకుండా అరికడదాం:బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
162

ఇంటిని,పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుదాం…సీజనల్ వ్యాధులను నివారిద్దాం…
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

మున్సిపల్ శాఖ మంత్రివర్యులు
కెటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు కార్యక్రమo లో భాగంగా చందానగర్ డివిజన్ వేమన వీకేర్ సెక్షన్ లో GHMC ఎంటమొలజీ సిబ్బంది తో కలిసి డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే పిచికారీ చేసి, చర్యలు చేపట్టామని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.

కార్పొరేటర్ మాట్లాడుతూ 6వ ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకేర్ సెక్షన్ పరిసరాల్లో సంపుల వద్ద ,పూల కుండీల, నీటి నిల్వ ను, ఎంటమాలజి సిబ్బంది తో కలిసి డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే పిచికారీ చేసి, బస్తి వాసులకు డెంగ్యూ, మలేరియా పై అవగాహన కల్పించి,అలాగే
కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని బస్తి వాసులందరు తప్పకుండా మాస్క్ లు,గ్లౌస్ లు,ఫిసికల్ డిస్టెన్స్, మరియు బయటికి వెళ్లితే సానిటయిజార్లు తప్పకుండా వాడాలని చెప్పటం జరిగినది.

ఈ కార్యక్రమంలో బస్తి వాసులు రమేష్,అంజి రెడ్డి,మౌలాలి,జ్యోతి,GHMC ఎంటమొలజీ సిబ్బంది శ్రీనివాస్,శివ,రాము తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here