ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ లు వ్యాప్తి చెందకుండా చేసుకుందాం.. శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

0
307

శేరిలింగంపల్లి, మే 10: రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మున్సిపల్ శాఖమంత్రి వర్యులు శ్రీ.కేటీఆర్ గారి పిలుపుమేరకు “ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు, 10నిమిషాలు” మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చెందే వైరస్లను అరికట్టేందుకు ప్రజలలో అవగాహన తీసుకురావాలని, ఈరోజు చందానగర్ సర్కిల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.బొబ్బ నవత రెడ్డి గారు, డిప్యూటీ కమిషనర్ శ్రీ.సుదాంష్ గారితో, ఎంటమాలజి సిబ్బందితో కలిసి నీటినిల్వలను శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై ప్రజలో అవగాహన తీసుకువస్తామని, మన ఇంట్లో ఉండే నీటి నిల్వలను శుభ్రం చేసుకోవాలని, పూల కుండీలను శుభ్రపరుస్తూ, ఎక్కువ రోజులు నీరు నిల్వవుండకుండా జాగ్రత్తలు పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ రవి, ఇతర శాఖల అధికారులు, కార్మికులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here