ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదంతో హరితహౕరం : బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
221

ఈచ్ వన్ ప్లాంట్ వన్ నినాదంతో హరితహారం కార్యక్రమం ముందుకు సాగాలి.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీ లో తెలంగాణకు హరితహారం 6వ విడత కార్యక్రమం లో భాగంగా కాలనీ వాసులతో కలిసి మొక్కలను నాటిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించున్నాక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారి మనసా పుత్రిక హరితహారం ఒకటి అని,తెలంగాణ మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అని,రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా, అన్ని రకాలుగా అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మలుచుకోవడమే తెలంగాణకు హరితహారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని,ప్రస్తుతం పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించటం, రానున్న తరాలకు ఆస్థి, ఐశ్వర్యాల కంటే మంచి ఆరోగ్యకరమైన వాతావారణాన్ని అందించటమే లక్ష్యంగా హరితహారం
కొనసాగుతోంది అని,గత ఐదేళ్లుగా దిగ్విజయంగా కొనసాగిన హరితహారం ఇప్పుడు ఆరవదశకు చేరుకుంది అని,బస్తీలు,కాలనీ లు,అపర్ట్మెంట్లలో మొక్కలు నాటాలి. అని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే మహా యజ్ఞం లో భాగస్వామ్యులు కావాలి అని,అనుకున్న ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యం నెరవేరాలి అని చెప్పటం జరిగినది.

ఈ కార్యక్రమంలో బొబ్బ దామోదర్ రెడ్డి,మల్లికార్జున్,సుధాకర్,నాగేశ్వర్ రావు,శాడక్షరి,శివ శంకర,విగ్నేశ్వర్ రెడ్డి,కవిత,మౌనిక,తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here