ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు సిగ్గు చేటు:హమీద్ పటేల్ కార్పొరేటర్

0
365

Nalla Sanjeeva Reddy
NAC NEWS CHANNEL
T.S Bureau Chief

ఎమ్యెల్యే గాంధీ గారి హాయంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు సిగ్గుచేటు : కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్*

ప్రభుత్వ విప్ & శాసన సభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ గారి పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హైదర్ నగర్ కిందికుంట చెరువును తన సొంత నిధులతో అభివృద్ధి పరుస్తూ వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటనికి మన ఎమ్యెల్యే గాంధీ గారు చేస్తున్న కృషి చాలా మంది భూ కబ్జాదారులకు కంటగింపుగా ఉంది. అందువల్లనే ఇలాంటి అసత్య ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కొండాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, హాఫీజ్పేట్, హైదర్ నగర్, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్ పల్లి, ఇలా ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ముందు ఎన్నడూ జరగని అభివృద్ధి మన ఎమ్యెల్యే గాంధీ గారి హయాంలో జరుగుతున్నందుకు, ప్రతిపక్షాలు ఓర్వలేక, అసత్య ఆరోపణలకు దిగటం సిగ్గుచేటు. రాత్రి, పగలు తేడా లేకుండా మన నియోజకవర్గం గురించి అహర్నిశలు కష్టపడటం తప్ప వేరే ఎటువంటి ఆలోచనలు లేని వ్యక్తి ఎమ్యెల్యే గాంధీ గారు. ప్రతిపక్షాలకు వంత పాడే కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్లకు, న్యూస్ చానెల్స్ కు తప్పుడు ప్రచారాలు చెయ్యటం తగదు అని హితువు చెబుతున్నాను. హైదర్ నగర్ కిందికుంట చెరువు సుందరీకరణ పనుల పర్యవేక్షణకు వెళ్లిన ఎమ్యెల్యే గాంధీ గారిపై భూకబ్జాదారులు మరియు కొందరు వ్యక్తిగత స్వలాభం కోసం నిరాధారమైన ఆరోపణలు చెయ్యటం, దానికి ప్రతిపక్షాలు తోడవటం అనేది నేటి నీచ రాజకీయాలకు పరాకాష్టగా భావిస్తున్నాను. గోకుల్ ఫ్లాట్స్ వాసులు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఏ నాయకుడికి డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవని ఈ విషయాన్నీ ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నాను. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతూ, రేయింబవళ్లు పని చేస్తున్న ఎమ్యెల్యే గాంధీ గారి పై నిందలు వెయ్యటం మానుకోవాలి. అన్ని కులాలు, మతాల వారిని ఆదరిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కొంతమంది ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్న ఆరోపణలకు ఎవరూ భయపడరు. గత పాలకులు హయాంలో చెరువులు ఏ విధంగా అన్యాక్రాంతం అయ్యాయో అందరికి తెలుసు. ఇంక ఏ చెరువులు అన్యాక్రాంతం కాకూడదని ఎమ్యెల్యే గాంధీ గారు దృఢ నిర్ణయంతో ఆ చెరువులను అభివృద్ధి పరుస్తుంటే, ఆ అభివృద్ధిని అడ్డుకోవటానికి చేస్తున్న విఫల ప్రయత్నమే ఇది. ఏ చెరువు కూడా కబ్జా కాకుండా వాటికీ కంచెలు వేయించి, పూడికలు తీయించి, చేస్తున్న సుందరీకరణ పనులు మీకు ఎవరికి కనిపించటం లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. వర్షా కాలం ప్రారంభం అయ్యే లోపు ప్రజలకు వాకింగ్ ట్రాక్, పార్క్ ఉపయోగంలోకి రావాలని గత 15 రోజులుగా రాత్రి, పగలు కష్టపడుతూ పనులు పూర్తి చేయించటం అక్కడ ఉన్న ప్రజలందరికి తెలుసు. అవినీతికి ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ఎమ్యెల్యే గాంధీ గారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అన్ని మతాలను కలుపుకొని పనులు చెయ్యటం తప్ప, ఆయన ఇంతవరకు ఎవ్వరిని మతం పేరుతో పిలిచినా దాఖలాలు లేవు. కొందరు కావాలని మతాన్ని అడ్డం పెట్టుకొని గాంధీ గారి ప్రతిష్టకు భంగం కలిగించటానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని మతాల వారికీ సమాన ప్రాధాన్యత కల్పించే నాయకుడు ఎమ్యెల్యే గాంధీ గారు. కులమతాలకు అతీతంగా, ఆడవారి పట్ల సోదరి భావంతో, అందరిని కలుపుకొని నియోజకవర్గం అభివృద్ధికి పని చేస్తున్నారు గాంధీ గారు, ఇప్పటి వరకు ఎంతో గౌరవ ప్రదంగా రాజకీయలకు అతీతంగా అహర్నిశలు కృషి చేస్తున్న గాంధీ గారి పై తప్పుడు ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని తెలియజేస్తున్నా.

హమీద్ పటేల్
కార్పొరేటర్
కొండాపూర్ 104 డివిజన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here