ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి చేతులమీదుగా నిరుపేద ప్రజలకు బియ్యం పంపిణీ

0
233

Serilingampally June 11: 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆశీర్వాదంతో ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మహమ్మారి కరోనా వలన ఇబ్బంది పడుతున్నా నిరు పేద ప్రజలకు తన వంతు సహాయం అని 20 మంది నిరుపేద ప్రజలకు బియ్యమును పంపిణీ చేయడం జరిగింది.

కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మాట్లాడుతూ… జన్మదినాలు లాంటి సందర్భాలలో అందరినీ పిలిచి ఫంక్షన్స్ చేసుకునే బదులు ఇలా నిరు పేద ప్రజలకు బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంచి పెట్టడం మంచి పరిణామం అని అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వార్డ్ నెంబర్ కాశీ, పోశెట్టి గౌడ్, బోయ కిషన్, కాసాని శంకర్, నాగభూషణం, కటక రవి వాసు, గుడ్ల శీను, అర్జున్, రవి తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here