చందానగర్ లో కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన మొదటి వ్యక్తిని పరామర్శించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
చందానగర్ డివిజన్ లో కరోనా వైరస్ బారినపడిన ఒకే ఒక వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో 14 రోజులు చికిత్స పొంది వైరస్ ని జయించి నిన్న ఇంటికి తిరిగిరావటం జరిగినది. అట్టి వ్యక్తిని వారి ఇంటివద్దకు వెల్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న కార్పొరేటర్, రాష్ట్ర ప్రభుత్యం తీసుకుంటున్న చర్యల మూలంగా మాకు గాంధీ హాస్పిటల్ లో మంచి సదుపాయాలతో డాక్టర్లు వైద్య పరీక్షలు చేయటం జరిగినదని వారి మూలంగా వైరస్ తగ్గుముఖం పట్టి నెగటివ్ రావటం తో డిశ్చార్జ్ చేసారని, హాస్పిటల్ లో మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని,వైద్యులకు,ప్రభుత్యానికి కృతజ్ఞతలు తెలియచేసిన కుటుంబ సభ్యులు,చందానగర్ డివిజన్ నుండి కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తి ఈ ఒక్కరే అని ఈమె క్షేమంగా తిరిగిరావటం తో చందానగర్ డివిజన్ లో ఈ రోజు వరకు ఇంకా ఎవ్వరు కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు లేరని,అదేవిధంగా ఈ రోజు వరకు డివిజన్ కు ఇతర దేశాల నుండి వచ్చిన వారు అధికారుల పర్యవేక్షణలో వారి వారి ఇండ్ల వద్దనే( quaranti ne ) క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు అందరూ క్షేమంగా వున్నారని,ఎవ్వరికీ కరోనా వ్యాధి లేదని తెలియచేస్తూ కార్పొరేటర్ సంతోషం వ్యక్తం చేసారు.
ఈ రోజు వరకు
చందానగర్ డివిజన్ లో ఒక వ్యక్తికి కూడా కరోనా వ్యాధి లేనందుకు డివిజన్ వాసులమయిన మన అందరం ఆనందించవలసిన విషయమని ఈ విషయంలో డివిజన్ వాసులు అందరూ ప్రభుత్యం సూచనలను శిరసావహించి సహకరించినందుకు డివిజన్ వాసులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .శానిటేషన్,స్ప్రే చేయించడంలో, త్రాగు నీరు సరఫరా లో విద్యుత్ సరఫరాలో,మరియు ప్రజలకు ఉపయోగపడే నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్న మని ,డివిజన్ వాసులు అందరూ గత 15 రోజు నుండి సహకరించినట్లుగానే మిగతా లాక్ డౌన్ రోజులలో కూడా ఇళ్ల నుండి బయటకి రాకుండా సహకరించాలని కూరగాయల షాప్ ల వద్ద,రేషన్ షాప్ ల వద్ద,మిగతా ముఖ్యమైన నిత్యావసరాల కొనుగోలు చేసే ఏరియాలలో తప్పని సరిగా దూరం పాటించి, తగిన భద్రత పాటించాలని ఈ రోజు వరకు చందానగర్ డివిజన్ లో ఒక కరోనా కేస్ కూడా లేదని,రాబోయే రోజులలో కూడా తిరిగి ఒక కేస్ కూడా నమోదు కాకుండా మనమందరం జాగ్రత్తగా వుందామని, ప్రజలను కోరిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.