కరోనాను నియంత్రణ చేస్తూనే నగర అభివృద్ధికి కృషి చేస్తాం : మేయర్, ఎమ్యెల్యే, కార్పొరేటర్లు

0
170

శేరిలింగంపల్లి, మే 5 : జీహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అరికెపూడి గాంధీ గారు స్వయంగా విచ్చేసి నూతనంగా మంజూరు అయినటువంటి రాఘవేంద్ర కాలనీ మరియు రాజరాజేశ్వరి కాలనీ హెచ్ టీ లైను రోడ్డు జేవీజీ హిల్స్ ప్రభు పాద నుండి వయా ఎస్ఎమ్మార్ మీదుగా మసీదు బండ మెయిన్ రోడ్డు వరకు 100 అడుగుల రోడ్డును, మరియు మసీదు బండ హెరిటేజ్ నుండి వయా రైల్వే బ్రిడ్జ్ న్యూ బాంబే వరకు 100 ఫీట్ రోడ్లను, జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మరియు ఉన్నత స్థాయి అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో తిరిగి పరిశీలించారు.

మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ఎమ్యెల్యే గాంధీ గారు మంజూరు అయిన రోడ్లను స్వయంగా పరిశీలించి, వాటికీ సంబంధించిన పనులను, సమస్యలను గూర్చి స్థానిక కార్పొరేటర్లు మరియు ఉన్నత అధికారులతో మాట్లాడి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ఎమ్యెల్యే గాంధీ గారు మాట్లాడుతూ..
కరోనా వైరస్ ను నియంత్రిస్తూనే, ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా, మన నగరాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన మంత్రివర్యులు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించటం కోసం ఈ సరికొత్త రహదారులను అభివృద్ధి పర్చటం జరుగుతుందని, రానున్న రోజుల్లో ట్రాఫిక్ ఫ్రీ సిటీ చేసే ప్రణాళికలో భాగంగా ఈ రోడ్ల మంజూరు, మరియు పనులను ప్రారంభించటం జరిగిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ తర్వాత ఒక కొత్త హైదరాబాద్ ను సిద్ధం చెయ్యటానికి ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.

మేయర్ గారు మరియు ఎమ్యెల్యే గారితో బాటుగా జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు మరియు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు, జోనల్ కమిషనర్ రవి కిరణ్ గారు, ఆర్డీవో చంద్రకళ గారు, డిప్యూటీ కమిషనర్ వెంకన్న గారు, సీసీపీ దేవేందర్ రెడ్డి గారు, సీపీ ఏకే రెడ్డి గారు, సీపీ శ్రీనివాస్ రావు గారు, హెచ్ ఆర్ డీసీఎల్ చీఫ్ ఇంజనీర్ వసంత గారు, హెచ్ అర్ డీసీఎల్ ఎస్ ఈ రాయమల్ గారు, హెల్త్ ఆఫీసర్ డా రంజిత్ గారు, ఎస్ ఈ మురళి కృష్ణ గారు, యూత్ నాయకులు దీపక్ గారు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది, జీహెచ్ఎంసి డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.