కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు, వలస కూలీల ఆకలి తీరుస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు నందు దాతల సహాయంతో సుమారు 50 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరియు భోజన పొట్లాలను కార్పొరేటర్ గారి చేతుల మీదుగా అందించారు.. ఈ కార్యక్రమంలో దాతలు శివ ఆనంద్, ప్రసన్న కుమార్, సాయి దీప్, సాయి గౌడ్, హఫీజ్ పెట్ వార్డ్ సభ్యులు కే.వెంకటేష్ గౌడ్ మరియు నాయకులు జయరాజ్ యాదవ్, నిమ్మల సంతోష్ గౌడ్, ఎం.రాజు, జె.కిరణ్, సృజన, సుధాకర్ ముదిరాజ్, నరేష్, బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
పేదప్రజల ఆకలి తీర్చడానికి స్వచ్ఛందగా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారు నివసిస్తునటువంటి కాలనీ, బస్తీలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువుల అందించడం, వారికి తోడుగా ఒక భరోసాని కల్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.