కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
195

దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, గంగారాం నందు ఇతర రాష్ట్రాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే 12 కిలోల బియ్యం, 500 రూపాయలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి అందించారు జగదీశ్వర్ గౌడ్.

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని, బయటకి వచ్చి ఇంట్లోకి వెళ్లే సమయంలో పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసారు.. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, రహీం, రవి కుమార్, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఆదిత్య నగర్ మరియు టిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు ఖాసీం, సదర లియకత్, షోయబ్, సలీం, మునఫ్ ఖాన్, మియాన్, అజీముల్లహ్ ఖాన్, మానికప్ప, ముఖ్తర్, రాములు, రామకృష్ణ, సత్యనారాయణ, యూత్ అధ్యక్షులు మహమ్మద్ ఖాజా, ఇమ్రాన, మూస, ఆర్షద్, షైక్ ఖాజా, ప్రవీణ్, ఇస్మాయిల్, ఙ్ఞానేశ్వర్, చిన, రోహిత్ ముదిరాజ్, మహేష్, మహిళలు నళిని, ఉమాదేవి, డి.ఈ సురేశ్, రెవెన్యూశాఖ అధికారులు ఆర్.ఐ చంద్ర రెడ్డి, విఆర్వో చంద్ర శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు…

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్ సౌత్ ఇండియా,నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.