కరోనా మహమ్మారి వలన ఎవ్వరు బయట తిరగలేని పరిస్థితిని గమనించిన హఫీజ్ పేట్ డివిజన్ 109 తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ మరియు ఎమ్ శ్రీకాంత్ రెడ్డి గారు తన సొంత నిధులతో డివిజన్ లో అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఎవ్వరు కూడా ఆకలి బాధ పడకూడదని ఈరోజు గంగారాం గ్రామం, గోకుల్ ఫ్లాట్స్ లో 200 మందికి 3కేజీ ల బియ్యం, కూరగాయలు, గోధుమపిండి, మామిడి పండ్లను, పంపిణీ చేయడం జరిగిందని హఫిజ్ పెట్ 109 డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లలోనుండి ఎవ్వరూ బయటికి రాకుండా ఉండాలని కోరారు. మన ఆరోగ్యం, ప్రాణం మన చేతుల్లోనే ఉందని దానిని మనం కాపాడుకోవాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ దొంతి శేఖర్, గ్యాని, రోహిత్, దినేష్, సాయి, విక్కీ, జీవీన్ మరియు గంగారాం యూత్ పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.