కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు మీకోసం, మన కుటుంబం ఆరోగ్యం కోసం జి.హెచ్.ఎం.సి సిబంది నిరంతరం కృషి చేస్తున్నారు.. గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ శ్రీ.బొంతు రామ్మోహన్ గారు ..

0
417

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు నిరంతరం అన్ని శాఖలతో ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని, ప్రజలందరూ ఇంకొన్ని రోజులు లాక్ డౌన్ ను పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని, మన కుటుంబం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం ప్రజలకోసం కృషి చేస్తున్న ఎంటమొలజీ డిపార్ట్మెంట్ కార్మికులను అభినందించారు..

ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ టవర్స్ నందు ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, జి.హెచ్.ఎం.సి కమిషనర్ శ్రీ.లోకేశ్ కుమార్ గారు, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ.అరెకపూడి గాంధీ గారు, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ.రవి కిరణ్ గారు, స్థానిక కార్పొరేటర్లు శ్రీ.హమీద్ పటేల్ గారు, శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు, డిప్యూటీ కమిషనర్లు శ్రీ.వెంకన్న గారు, శ్రీ.సుదంష్ గారితో కలిసి నగర్ మేయర్ గారు శ్రీ.బొంతు రామ్మోహన్ గారు శేరిలింగంపల్లి జోనల్ అన్ని శాఖల అధికారులు, ఎంటమొలజీ డిపార్ట్మెంట్ కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు..

ప్రతిజ్ఞ..
నేను జి.హెచ్.ఎం.సి ఉద్యోగిగా బాధ్యత గల పౌరుడిగా వ్యక్తి ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తానని కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ఇతర శాఖలతో సమన్వయానికి సహకరిస్తూ సదా కృషి చేస్తానని, ఈ కరోనా మహమ్మారి వ్యాధిని కట్టడి చేయడంలో సరైన అవగాహన కలిగి ఉండి నా తోటి వారందరికీ చైతన్యం కలిగిస్తానని మాట ఇస్తున్నాను. ప్రస్తుతం దేశం/రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ ఆరోగ్య సమస్యను అధిగమించడంలో నిర్విరామంగా నా సేవలు నిబద్ధతతో అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు.. ఈ కార్యక్రమంలో ఈ.ఈ చిన్నా రెడ్డి, వెంకటేశ్వర్లు, డి.ఈ శ్రీమతి.శ్రీ.రూప దేవి, శ్రీ.బాలమురలి, ఏ.ఈ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.