కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి.సతీష్ కుమార్ సహకారంతో ఒక నెలకు సరిపడా నిత్యావసరాల సరుకుల కిట్స్ ను పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.

0
479

శేరిలింగంపల్లి, మే 7: దైవ చింతనలోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటామని కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి. సతీష్ కుమార్ నిరూపిస్తున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అభినందించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ సహాయంతో ఒక నెలా సరిపడా నిత్యావసర సరుకుల కిట్ ను గురువారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా పేదలకు లింగంపల్లి రైల్వే బ్రిడ్జి ఆవరణలో అందజేశారు. దైవ చింతన, ప్రార్థనా ఉపన్యాసాలతో ఎంతో మంది మన్ననలు పొంది కల్వరి టెంపుల్ కు పెద్ద సంఖ్యలో సభ్యత్వం కల్పించిన సతీష్ కుమార్ పేదలకు సాయం అందించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మరోసారి కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ నిరూపించారని అన్నారు. కల్వరి టెంపుల్ డైరెక్టర్ జయరాజ్, రిప్రజెంటివ్ వై. రాజు, సిబ్బంది శంకర్, భాస్కర్, మూర్తి, మల్లేష్, రమణ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here