కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి ఆరంభం.

0
169

కెసిఆర్ కేటీఆర్ పిలుపుతో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి.
ఈరోజు ఉదయం 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్
దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు GHMC సిబ్బందితో కలసి పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ బండ సర్కిల్ నుండి జన్మభూమి కాలనీ వరకు రోడ్డు పొడవునా పర్యటిస్తూ
రోడ్డు ప్రక్కన మరియు డివైడర్ పైన చెత్త వేసే వారిని మందలిస్తూ GHMC ఏర్పాటు చేసిన చెత్త బండ్లలో మాత్రమే చెత్త వేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లఘిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ రోజు నుండి 8 రోజులవరకు డివిజన్ లోని అన్ని ప్రాంతాల్లో GHMC సనిటైసేషన్ వారోత్సవాలు మొదలు అయినందున ప్రతి రోజు ఒక కాలనీలో ఉదయం 6:00 పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్, కాశీనాధ్ యాదవ్, చిన్నోల్ల శ్రీను, ఏరియా కమిటీ మెంబెర్స్ వెంకటేష్, శౌఖత్ అలీ మున్న, నాయకులు బోయ కిషన్, బుల్లెట్ రవి, రమేష్ సాగర్, దుర్గేశ్, జగదీష్, గుడ్ల శ్రీనివాస్, హరీష్, అశోక్, ఖాజ, రామస్వామి, రాంచందర్, సంతోష్ బిరాధర్, ఖలీమ్, కుర్మయ్య, రెహ్మాన్, కృష్ణ, ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here