తేది.మే1: కరోనాను కట్టడి చేయాలంటే సామాజిక దూరం పాటించడమే నివారణ మార్గమని, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పేద కుటుంబాలు, వలస కుటుంబాలకు ఎప్పటికప్పుడు చేదోడువాదోడుగా ఉంటూ వారి మౌలిక వసతుల ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే ప్రతి ఏరియాకు తన స్వంత ఖర్చులతో నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ లోని పేద కుటుంబాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కూలీల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేసేందుకు 50 క్వింటాళ్ల బియ్యం, మంచి నూనె ప్యాకెట్లతో పాటు పప్పు తదితర సామాగ్రిని శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వయంగా ప్యాకింగ్ చేయిస్తూ ఏరియాల వారీగా పంపిస్తున్నారు. ఏ ఒక్కరూ పస్తులు ఉండరాదనే ఉద్దేశంతో తన స్వంత ఖర్చులతో నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.