మాధాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా.
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌళికవసతుల కల్పనకు కృషి చేస్తున్నారని..మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీలో మంజూరైన అభివృద్ధి పనులను ముమ్మరంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు మాధాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ వ్యాలీ/సైబర్ విలేజ్ కాలనీలో నెలకొన్న డ్రైనేజ సమస్యను మరియు కాలనీలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్లను కాలనీ సభ్యులతో కలిసి పరిశీలించారు..
ఈ కార్యక్రమంలో సత్తి రెడ్డి,ప్రభుధన్ రెడ్డి,జయప్రకాష్ రెడ్డి,మహేందర్,వెంకట్ గౌడ్,అరవింద్,శ్రీహరి,జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.