కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్ పిలుపు :ఇంట్లోనే ఉందాం,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులు రాకుండా అరికడదాం

0
221

ఇంట్లోనే ఉందాం,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి,సీజనల్ వ్యాధులు రాకుండా అరికడుదాం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారు దిశనిర్దేశంలో రాష్ట్రాల్లో ప్రతి అభివృద్ధి విషయంలో మరియు ప్రజల ఆరోగ్యం విషయంలో ఎన్నో ముందు జాగ్రత్తలు వాటి నివారణ చర్యలపై ఎప్పటికపుడు సమీక్షిస్తూ అధికారులను,ప్రజాప్రతినిధులను,ప్రజలను అప్రమత్తం చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి పిలుపుమేరకు ప్రతి ఆదివారం,ఉదయం 10గంటలకు,10నిమిషాలు మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా వ్యాప్తి చెందకుండా వైరసలను అరికటేందుకు ప్రజలో అవగాహన తీసుకురావాలి పిలుపునిచిన నేపథ్యంలో…
ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్ నందు స్థానిక ప్రజలు,ఎంటమాలజీ సిబ్బందితో కలిసి బస్తీలో పర్యటించి నీటినిల్వలను శుభ్రం, మరియు పరిసరాల పరిశుభ్రత చేసే కాకార్యక్రమాన్ని చేపట్టారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రజలకు సీజనల్ వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రతి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన తీసుకువస్తామని,మన ఇంట్లో ఉండే నీటి నిల్వలను శుభ్రం చేసుకోవాలని,పూల కుండీలు,ఎయిర్ కూలర్లు,వాటర్ ట్యాంక్ లో ఎక్కువ రోజులు నీరు నిల్వవుండకుండా జాగ్రత్తలు పాటించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు పిలుపునిచ్చారు…

ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,మహేష్,చోటేమియా,దుర్గేష్,నయిమ్,అహ్మద్,దేవయ్య,విజయ్,శ్రీను,సులేమాన్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here