కార్యకర్తలకు నిత్యావసర సరుకుల పంపిణీ: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

0
360

శేరిలింగంపల్లి, మే 13: 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఈ రోజు మధ్యాహ్నం తన కార్యాలయంలో డివిజన్ లోని NTR నగర్ మరియు PJR నగర్ లో ఉన్న 70 మంది ముఖ్య కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం మరియు నూనె ప్యాకెట్లు అందజేయడం జరిగింది. తదనంతరం కార్పొరేటర్ గారు మరియు యువనేత రామకృష్ణ గౌడ్ కార్యకర్తలతో నాయకులతో కలసి భోజనం చేయడం జరిగింది.

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ… లాక్ డౌన్ సమయంలో నాతో ప్రయాణిస్తున్న ప్రతి కార్యకర్తలను నాయకులను ఆదుకుంటానని. ఇదేవిధంగా డివిజన్ లోని మిగతా నాయకులకు కార్యకర్తలకు కూడా బియ్యం నూనె ప్యాకెట్లు అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో యువ నేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, బోయ కిషన్, పోశెట్టి గౌడ్ మరియు NTR నగర్, PJR నగర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here