కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించినందున ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే, కార్పోరేటర్ విజ్ఞప్తి చేశారు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలకు, దినసరి కూలీలకు నిత్యావసరాల సరుకులు అందించాలని
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ నివాసితులు శేరిలింగంపల్లి టిఆర్ఎస్ నాయకులు శ్రీ లక్ష్మా రెడ్డి గారు నిర్ణయించి వారి ఆధ్వర్యంలో సుమారు 150మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ అరెకెపూడి గాంధీ గారు,మాదాపూర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారి చేతుల మీదుగా అందించారు..
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
పేద ప్రజలకు,రోజు కూలి చేసుకొని బ్రతికే ప్రజలకు కరోనా వైరస్ వల్ల రోజు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నవారికి తోడుగా,అండగా జి.లక్ష్మా రెడ్డి నిత్యావసరాల వస్తువులు ఏర్పాటు చేసారని,వారికి ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ ,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారు .
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి బ్యూరో చీఫ్ ,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.