కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ లో 3వ రోజు కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం.

0
258

Serilingampally June 03: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి పిలుపుమేరకు బుధవారం కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్ లో 3వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో మున్సిపల్ సిబ్బంది, వార్డ్ మెంబర్స్, ఏరియా కమీటీ మెంబర్స్, టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి నిజాంపేట రోడ్ లోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వరకు రోడ్ల పై పడవేసిన ప్లాస్టిక్ కవర్స్, చెత్త కుప్పలను, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన గడ్డి తో పాటు మట్టిని తొలగించి రోడ్లను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రగతి కార్యక్రమం తో రోడ్లును శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాలనీ ప్రజలు ఎవరు కూడా ఆరుబయట, రోడ్లపై చెత్తాచెదారం పడేయవద్దని కోరారు. మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల ను కట్టడి చేయడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ చిందం శ్రీకాంత్, విజయ, ఏరియా కమిటీ మెంబర్స్ శేషయ్య, రేణుక, తెరాస నాయకులు వెంకటేష్ యాదవ్, నాగేశ్వరరావు, బాలాజీ, శివాజీ, ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here