కోవిద్ -19 సేవలు అందిస్తున్న వైద్యులకు, ఆశావర్కర్లకు అలవేన్స్ ఇవ్వాలి: జేఏసీ ఛైర్మన్ డాక్టర్ రవిశంకర్, రాష్ట్ర కన్వీనర్‌ కర్నాటి సాయిరెడ్డి.

0
1059

హైదరాబాద్:
రాష్ట్రంలో కోవిద్ -19 సేవలందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు వెహికిల్ అలవవెన్స్, పారామెడికల్ వైద్య సిబ్బందికి ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని కోరుతు తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ వి.రవిశంకర్, రాష్ట్ర కన్వీనర్‌ కర్నాటి సాయిరెడ్డిలు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కు వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ బి ఆర్కే భవనంలో మంత్రి ఈటలను కలిసి వారితో కోంతసెపు మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా సౌకర్యం పూర్తిగా బంద్ కావడంతో, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులను సైతం ఎదుర్కోని విధులు నిర్వర్తించారన్నారు. కోవిద్-19 (కరోనా) నిర్మూలనకై నిరంతరం పారామెడికల్ సిబ్బంది శ్రమిస్తున్నారని, వారి సేవలను గుర్తిస్తూ వైద్యాధికారులకు వెహికల్ అలవెన్స్, పారామెడికల్ ఇబ్బందికి ట్రావెలింగ్ అలవెన్స్ ను జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు నుండి వినియోగించుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా కరోనా వైరస్ ప్రాణాంతకమైన వ్యాధి అని తెలిసి, కుటుంబాన్ని వదిలి పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పారా మెడికల్ సిబ్బందికి రూ. 10000/- ఇన్సేంటీవ్ ఇవ్వాలని కోరారు. నిషేదిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేసిన ఆశావర్కర్లకు రూ.7500/- ఇన్సేంటీవ్ ఇవ్వాలని కోరారు. ప్రతి రోజు వారిగా సర్వేలు, హోమ్ క్వారంటైన్ కుటుబాలను సందర్శించి వారికి సేవలు అందించడం మరువలేనిదని, అందుకు ముఖ్యమంత్రి గిఫ్ట్ ఇన్సేంటీవ్ క్రింద మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాదిరిగానే పారామెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. కోవిద్-19 (కరోనా) పారద్రోలుటకు 24 గంటలు శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలను గుర్తించాలని కోరారు. వారివెంట రాష్ట్ర వర్కింగ్ కమిటి ఛైర్మన్ డాక్టర్ కత్తి జనార్ధన్, రాష్ట్ర కో కన్వీనర్లు డాక్టర్ అభిరామ్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.