శేరిలింగంపల్లి, మే16: చేయి చేయి కలుపుదాం,మన గోపి చెరువును రక్షించుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో చెరువులకు పునర్జీవం ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కేసీఆర్ గారిది. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గం, లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్, బాపు నగర్, ఆదర్శ నగర్, లింగంపల్లి గ్రామాలకు ఎన్నో ఏళ్ళు పంటపొలాలకు నీరు అందించి ఈరోజు డ్రైనేజ నీరుతో తన ఉనికినే కోల్పోయే పరిస్థితులలో ఉన్న గోపి చెరువు సంరక్షణ కోసం ప్రతిఒక్కరం చేయి చేయి కలిపి గోపి చెరువును సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు… ఈరోజు గోపి చెరువులో డ్రైనేజ నీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ.రవి కిరణ్ గారిని కలిసి వినతిపత్రాన్ని అందించారు.
Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL.