గౌరవ యంపి డాక్టర్ శ్రీ రంజిత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ గారు, చైర్మన్ కొండల్ రెడ్డి గార్ల తో కలిసి తన స్వంత నిధులతో ప్రజలకు, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు.

0
258

ఈరోజు వికారాబాద్ జిల్లాలోని కస్లాబాద్, చంద్రయన్ పల్లి, కల్కొడ్ గ్రామాలలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి గార్లతొ కలసి ప్రజలకు కూరగాయలు, గ్రుడ్లు ను పంపిణీ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక యం.పి.పి. వసంత గారు, జడ్పీటీసీ విజయ్ కుమార్ గారు, గ్రామ సర్పంచులు, యం.పి.టి.సి లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL.