చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి వలస కార్మికులందరికీ ప్రభుత్వం తరుపున వచ్చిన బియ్యం ను Ghmc అధికారులతో కలసి పంపిణీ చేశారు..

0
343

చందానగర్ డివిజన్ లో ఉన్న వలస కార్మికులకు ప్రభుత్యం సాయం చేస్తున్న బియ్యం ని GHMC అధికారులతో కలిసి పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Telangana

కరోనా వైరస్ వ్యాప్తినివారణకై ప్రభుత్వం అమలుజేస్తున్న లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలి తో బాధపడకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ జీవనోపాధికై నగరానికి వలస వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకున్న ఇతర రాష్ట్ర కార్మికులకు ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యాన్ని అందచేయటం జరిగినది. చందానగర్ డివిజన్ పరిధిలోని వలస కార్మికులు అందరినీ గుర్తించి వారందరికీ తెలంగాణ ప్రభుత్వ సాయాన్ని తప్పక అందిస్తాం అని చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో, సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here