చేయి చేయి కలుపుదాం -మన గోపి చెరువును రక్షించుకుందాం:నవయుగ యూత్ అసోసియేషన్

0
197

గోపి చెరువు సంరక్షణ మనందరి బాధ్యత..
నవయుగ యూత్ అసోసియేషన్..

చేయి చేయి కలుపుదాం,మన గోపి చెరువును రక్షించుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో చెరువులకు పునర్జీవం ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారిది..
కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గం,లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్,బాపు నగర్,ఆదర్శ నగర్,లింగంపల్లి గ్రామాలకు ఎన్నో ఏళ్ళు పంటపొలాలకు నీరు అందించి ఈరోజు డ్రైనేజీ నీరుతో తన ఉనికిని కాపాడుకొని పరిస్థితులలో ఉన్న గోపి చెరువు సంరక్షణ కోసం ప్రతిఒక్కరం చేయి చేయి కలిపి గోపి చెరువును సంరక్షించుకోవలని పిలుపునిచ్చారు నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు..గోపి చెరువులో డ్రైనేజీ నీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు శేరిలింగంపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారినీ కలిసి వినతిపత్రం అందజేశామని నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. లాక్ డౌన్ పూర్తి కాగానే గోపి చెరువు సమస్యను తప్పకుండా పరిష్కారిస్తామని గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారు హౕమీ ఇచ్చినట్లు నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here