తేది మే1: ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం, శంకర్ పల్లి మండలంలోని టంగుటూర్, చెందిప్ప గ్రామాలలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను మరియు గుడ్లను పంపిణీ చేయించడం జరిగింది, మరియు అనారోగ్యంతో బాధపడుతున్న టంగుటూర్ గ్రామానికి చెందిన బల్వంత్ రెడ్డి అనే వ్యక్తికి 30000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యం. పి.పి.డి. గోవర్ధన్ రెడ్డి గారు, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్ గారు, కన్నా గారు మరియు ఎస్.ఆర్. గ్రూప్ సిబ్బంది పాల్గొని పంపిణీ చేయడం జరిగింది.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.