జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్:Ghmc పారిశుద్ధ్య కార్మికులకు,గుడిసెలలో ఉండే నిరుపేదలకు నిత్యావసరాల సరుకులు దాతలు పంపిణీ చేయడం గొప్ప విషయం:

0
263

జి.హెచ్.ఎం.సి పారిశుధ్య కార్మికులకు మరియు గుడిశెలో ఉండే నిరుపేద ప్రజలకు నిత్యావసర వస్తువుల, కూరగాయల పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ నందు టిఆర్ఎస్ యువజన రాష్ట్ర సెక్రటరీ శ్రీ లింగంపల్లి తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుపేద రోజు వారీ కూలీలకు మరియు జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను పంపిణీ చేశారు,
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు పాల్గొని పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల అందచేశారు,ఇలాంటి క్లిష్టమైన సమయంలో తమ ఆరోగ్యం కుటుంబాన్ని కూడా లెక్కచేయకుండా మన కోసం,మన సమాజం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు మరియు సామాజిక బాధ్యతగా గుడిశెలో నివసించే నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకుల మరియు కూరగాయలు అందించడం చాలా సంతోషంగా ఉందని,దాతలను అభినందించారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,ప్రజలందరూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కుమార్,రవీందర్,ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు..

Telangana State
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.