జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్ :పేద ప్రజల ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావడం హర్షించదగిన విషయం.

0
233

పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఎంతో మంది దాతలు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు విధించిన లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు,రోజు వారీ కూలి పనులు చేసుకునే వారికి ఎంతో మంది ధాతలు ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా నిత్యావసర వస్తువుల,కూరగాయలు అందించడం జరుగుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
*ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని*

1…మాతృశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో ఉండే 500మంది అపార్ట్మెంట్ వాచమన్ వాళ్లకు మరియు కాలనీలో పనిచేసే జి.హెచ్.ఎం.సి కార్మికులకు నిత్యావసర సరుకుల అందించారు..

2… అరుణోదయ కాలనీలో అసోసియేషన్ సభ్యులు శ్రీమతి.శ్రీ.నీలిమ గారు తమ సొంత ఖర్చుతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు నిత్యావసర వస్తువుల అందించారు..

3.. చంద్ర నాయక్ తండా,వై.ఎస్.ఆర్ కాలనీలో నివాసముండే సంఘ సేవకులు శ్రీ నారాయణ రెడ్డి గారు 250మంది రోజువారీ కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు..

4. ఇజ్జత్ నగర్ టిఆర్ఎస్ యువ నాయకులు శ్రీ శ్యామ్ గారు,లోకేష్ గారు ఈరోజు సుమారు 500మంది నిరుపేద కుటుంబాలకు వారి సొంత ఖర్చుతో నిత్యావసర వస్తువుల అందించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు పాల్గొని నిరుపేదలకు ఆయా సరుకులను అందించారు.. ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,ఓ.బలరాం,శైలు,అనిల్ కుమార్,ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,ఎన్ ఏ సి న్యూస్ చానల్.