జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేస్-5 లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల సరుకులు పంపిణీ.

0
382

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేస్-5 సెంట్రల్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో… జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులకు వారు చేస్తున్న సేవలకు ఏమైనా సహాయం చేయాలని సభ్యులు అభిప్రాయ పడినపుడు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ నల్లా సంజీవ రెడ్డి గారు కూడా సభ్యుల అభిప్రాయంతో ఏకీభవించి.. కార్మికులకు ఒకొక్కరికి 5కిలోల బియ్యం, కందిపప్పు అసోసియేషన్ తరుపున ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని అధ్యక్ష,కార్యదర్శులు సత్యమూర్తి,వాసుదేవరావు గార్లు తెలిపారు.
అందరూ లాక్ డౌన్ ను విధిగా పాటించి తమవంతు సహకారం అందించాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు
ఈ యొక్కపంపిణీ కార్యక్రమంలో,సత్యమూర్తి, వాసుదేవరావు,విజయభాస్కర్, సురేష్ ,రాం కిషన్ రావు,సత్యలక్ష్మి,శివాజీ మధు,చినబాబు,రమేష్
శ్రీనివాస్ పాల్గొన్నారు.

 

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్