జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేస్-4B : ఐ.శివ ప్రసాద్ కుటుంబం మరియు మిత్రులు కలిసి పేదలకు నిత్యావసరాల సరుకులు, కూరగాయల పంపిణీ:

0
368

Serilingampally, 04.05.2020 Monday: కరోన వలన గత 43 రోజులుగా ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు, నిరాశ్రయులకు,రోడ్ ప్రక్కన నివసిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు, పురోహితులకు, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ కార్పోరేటర్లు శ్రీమతి & శ్రీ పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు జనప్రియ రెసిడెంట్స్ సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నల్లా సంజీవ రెడ్డి గార్ల సూచన మేరకు ౩ కిలోల బియ్యం ,కంది పప్పు ,కూరగాయలను దీప్తి శ్రీనగర్, H.M.T కాలనీ, వీడియాకాలనీ, మరియు జనప్రియ 4th ఫేజ్ B-బ్లాక్ దగ్గర అందరికీ దాదాపు 150 కుటుంబాలకు పంచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఐ .శివ ప్రసాద్ , ఐ.హైమ , ఐ.విజయ రామకృష్ణ , బి.శరత్ చంద్ర , P .రవి తేజ , M .యోగి సాయి రామ్ M.శ్యామ్,R.సాగర్, రసూల్ , S .తిరుమల్, K .రాజేష్ పాల్గొన్నారు .

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.